స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న '#అల్లు అర్జున్ 19' హైదరాబాద్‌లో ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వదిలింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేసినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ అమ్మడు ఇటీవల చిత్రలహరి సినిమాలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది.
అల్లు-త్రివిక్రమ్ సినిమాలో చిత్రలహరి హీరోయిన్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా '#అల్లు అర్జున్19'. పూజా హెగ్డే కథానాయిక. యువ హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో... రెండవ కథానాయిక పేరు వెల్లడించింది చిత్రబృందం.
అల్లు అర్జున్‌కు జోడీగా చిత్రలహరి హీరోయిన్
ఇప్పటికే నివేదా చిత్రీకరణలో పాల్గొందని.. సుశాంత్‌తో కలిపి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి సినిమాలో వీరిద్దరి పాత్రలేంటి? వాటి పరిధి ఎంతన్న విషయాలు తెలియాల్సి ఉంది.
గీతా ఆర్ట్స్ - హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఏ19 చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.