టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందబోతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రాన్ని పరశురామ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్. అయితే తాజాగా ఈ చిత్రంలో నటి నివేదా థామస్ ఓ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం.
మహేశ్ సినిమాలో నివేదా థామస్! - మహేశ్ సర్కారు వారి పాట
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో నివేదా థామస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
మహేశ్
నివేదా తెలుగులో 'జెంటిల్‌మెన్', 'నిన్నుకోరి', 'బ్రోచేవారెవరురా'లాంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'వి' ద్వారా త్వరలో ప్రేక్షుకల్ని పలకరించనుంది. పవన్ కల్యాణ్ సరసన 'వకీల్ సాబ్' చిత్రంలోనూ సందడి చేయనుంది. మొత్తం మీద అన్నీ కుదిరితే తొలిసారిగా మహేశ్‌తో కలిసి తెరపంచుకోనుందన్నమాట.
ఇప్పటికే విడుదలైన మహేశ్ ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో ప్రిన్స్ గడ్డంతో కూడిన మాస్‌లుక్‌లో కనిపించారు.