విభిన్న చిత్రాలతో మెప్పిస్తూ టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం అతడు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'బ్రోచేవారెవరురా'. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న నివేదా థామస్ లుక్ను విడుదల చేసింది చిత్రబృందం.
శాస్త్రీయ నృత్య భంగిమతో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ యువతి ధైర్యమైన మహిళగా ఎదగడమే 'మిత్ర' పాత్ర అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది నివేద.
విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని ఇతర పాత్రల్లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.