నివేదా థామస్, నివేదా పేతురాజ్.. పేర్లు మాత్రమే కాదు నటన పరంగా ఇద్దరూ ఒకటే. 'జెంటిల్‌మన్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది థామస్. 'మెంటల్ మదిలో' అంటూ ఇక్కడి వారిని పలకరించింది పేతురాజ్. కథా బలం ఉన్న చిత్రాలు ఎంచుకుంటూ తమ నటనతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేశారు.
2019లో కలిసొచ్చారు.. 2020లో పోటీ పడుతున్నారు - telugu cinema newsd
2019లో కలిసి నటించిన నివేదా థామస్, నివేదా పేతురాజ్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. వీరిద్దరూ నటించిన దర్బార్, అల వైకుంఠపురములో చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.
నివేదా
2019లో శ్రీ విష్ణు కథానాయకుడుగా వచ్చిన 'బ్రోచేవారెవరురా' చిత్రంలో కలిసి నటించారు నివేదా థామస్, నివేదా పేతురాజ్. అలా ఒకే చిత్రంలో దర్శనమిచ్చిన వారు 2020 సంక్రాంతి బరిలో నిలిచారు. విశేషం ఏంటంటే? ఇద్దరూ వేర్వేరు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. నివేదా థామస్.. రజనీ 'దర్బార్'లో, పేతురాజ్ 'అల వైకుంఠపురములో' చిత్రాల్లో నటించారు. అంతేకాదు సినీ కెరీర్ పరంగా ఈ ఇద్దరికీ ఇదే తొలి సంక్రాంతి.
ఇవీ చూడండి.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ..!