ఎటువంటి పాత్రనైనా బిడియం లేకుండా పోషించి తన నటనతో పాటు, అందంతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ నివేదా థామస్. చివరగా రజనీకాంత్ 'దర్బార్'లో కనిపించిన ఈ భామ.. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇటీవలే నాగ్ అశ్విన్ నివేదాను కలిసి తన పాత్రను వివరించగా.. ఆమెకు విపరీతంగా నచ్చిందట. త్వరలోనే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ చిత్రంలో నివేదా థామస్? - radheshyam movie latest news updates
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్.. దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ కలయికలో రానున్న సినిమాలో నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
నివేదా థామస్
ఈ ఏడాది ప్రారంభంలో ప్రభాస్ 21వ చిత్రం ఖరారైనట్లు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా సినిమాగా రూపొదించనున్నట్లు స్పష్టం చేసింది.సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో డార్లింగ్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాతే నాగ్ అశ్విన్‌తో చిత్రం పట్టాలెక్కనుంది.