టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఏప్రిల్ 15న హైదరాబాద్లోని తన నివాసంలో షాలినితో ఇతడికి నిశ్చితార్థమైంది. అయితే, కరోనా కారణంగా వివాహం వాయిదా పడింది. తాజాగా, జులైలో ప్రైవేటుగా ఏర్పాటు చేయనున్న వేడుకలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారని సమాచారం. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారట.
నితిన్ది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించడం వల్ల.. తమ కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారు.