తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఊర మాస్ ​లుక్​లో నితిన్​.. రామ్​ 'ది వారియర్'​ క్రేజీ అప్డేట్​ - ram pothineni new movie

Macherla Niyojakavargam Movie: కొత్త సినిమా అప్డేట్లు వచ్చేశాయి. నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం', తమిళ సూపర్​స్టార్ విజయ్ నటిస్తున్న 'బీస్ట్'​ సహా రామ్​ పోతినేని 'ది వారియర్​' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

vijay new movie beast
nitin new movie

By

Published : Mar 26, 2022, 1:02 PM IST

Macherla Niyojakavargam Movie: ఐఏఎస్‌ అధికారి పాత్రలో నితిన్‌ నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎన్‌. సిద్ధార్థ్‌రెడ్డిగా కనిపించనున్నారు. ఆ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఇందులో నితిన్‌ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ దుస్తుల్లో సీరియస్‌గా కనిపించారు.

'మాచర్ల నియోజకవర్గం'

ఇది.. ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన దృశ్యమనిపిస్తోంది. "మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా" అని నితిన్‌ ట్వీట్‌ చేశారు. ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

కృతిశెట్టి

'ది వారియర్'​ అప్డేట్​..:రామ్​ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రం ది వారియర్​. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్​ను ఆదివారం ఉదయం 9.46 గంటలకు వెల్లడించనుంది చిత్రబృందం. ఇందులో రామ్​ సరసన కృతిశెట్టి హీరోయిన్​గా చేస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

'ది వారియర్​'

Vijay New Movie Beast: కోలీవుడ్‌ స్టార్​ హీరో విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'బీస్ట్‌'. పూజా హెగ్డే కథానాయిక. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ కామెడీ- యాక్షన్‌ థ్రిల్లర్‌ ఏప్రిల్‌ 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను విడుదలచేసింది చిత్రబృందం.

'బీస్ట్‌'

ఇదీ చూడండి:'ఆదిపురుష్'​ క్రేజీ అప్డేట్​.. తెలుగులోకి మలయాళీ క్లాసిక్!

ABOUT THE AUTHOR

...view details