తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నితిన్‌ ప్రేమ వివాహం.. పెళ్లి వేదిక ఎక్కడంటే..! - bheeshma

టాలీవుడ్ యువ హీరో నితిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడట. తను ప్రేమించిన అమ్మాయినే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుబోతున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.

nitin
నితిన్

By

Published : Dec 14, 2019, 6:34 AM IST

రెండు మూడు రోజులుగా యువ హీరో నితిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పుడిది చిత్రసీమ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ నటుడు ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నితిన్‌ మనసు దోచిన ఆ అందాల సుందరి ఎవరా అని సినీప్రియులంతా ఆరా తీస్తున్నారు.

తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి మరో కబురు బయటకొచ్చింది. ఈ భామకి చిత్రసీమతో సంబంధం లేదని, కాకపోతే ఆమె తెలుగమ్మాయే అని తెలుస్తోంది. అంతేకాదు ఈ యువ హీరో.. విరాట్‌ కోహ్లీ, రణ్‌వీర్‌ సింగ్‌ల్లా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నాడట. తన పెళ్లి వేడుకను దుబాయ్‌లో నిర్వహించుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు సినీ, రాజకీయ సీమలకు చెందిన కొద్దిమంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించనున్నాడట.

దుబాయ్‌లో వివాహ వేడుక ముగిశాక.. హైదరాబాద్‌లో చిత్రసీమ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ పెళ్లి వార్తల్లో నిజమెంత.. వివాహ వేదిక నిజమేనా? కాదా? అన్నవి తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ప్రస్తుతానికైతే ఈ యువ హీరో వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' చిత్రంతో బిజీగా ఉన్నాడు.

ఇవీ చూడండి.. ఈ బయోపిక్‌ని ఉచితంగా చూడొచ్చు

ABOUT THE AUTHOR

...view details