తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నెటిజన్లపై నిత్యామీనన్​కు చాలా కోపమొచ్చింది!

సామాజిక మాధ్యమాల వేదికగా తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది నిత్యామీనన్​. ఒకరిని కామెంట్ చేసేముందు.. తమను తాము ప్రశ్నించుకోవాలని మండిపడింది. మిషన్​ మంగళ్​ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నిత్య.. ఇటీవల కొన్ని ఫొటోలను సోషల్​మీడియాలో షేర్​ చేయడంపై ఈ విమర్శల పర్వం మొదలైంది.

నిత్యా మీనన్​

By

Published : Aug 13, 2019, 1:27 PM IST

Updated : Sep 26, 2019, 8:50 PM IST

నిత్యామీనన్​.. దక్షిణాది భాషల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక. తాజాగా మిషన్​ మంగళ్ చిత్రం ద్వారా బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టిన ఫొటోలపై చురకలంటిస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఫొటోలు షేర్​​ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్లపై ఘాటుగా స్పందించింది నిత్యా. ఎవరో ఏదో అన్నారని తాను చేస్తోన్న సాయం తెలియాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది.

"కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో నాపై వస్తున్న విమర్శలకు ఇదే నా స్పందన. కేరళ వరదల గురించి నేను ఏమి మాట్లాడటం లేదని, సోషల్​ మీడియాలో ఏమి పోస్ట్ చేయడం లేదని నాపై ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా నేను ఇలాంటి వాటికి స్పందించను. కానీ నన్నే లక్ష్యంగా తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. అందుకే వివరణ ఇచ్చేందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సామాజిక మాధ్యమాల్లో కొన్ని విషయాలే పంచుకోగలం. అంతర్జాలంలో పోస్ట్​ చేయనంత మాత్రాన నేను ఏమీ చేయట్లేదనుకోవడం మీ భ్రమ. కేరళ వరదల గురించి నేను ఏ విధంగా సాయం చేస్తున్నానో మీకెవరికీ తెలియదు. డబ్బుల కోసమే సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నానని విమర్శిస్తున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత చిత్ర ప్రచారంలో పాల్గొనడం నా విధి. అందుకోసం నాకు ప్రత్యేకంగా పైసా కూడా చెల్లించరు. నన్ను విమర్శిస్తున్న వారందరినీ నేను ఒకటే అడుగుతున్నా... కేరళ కోసం మీరు ఏం చేశారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలిగితే మరొకరిపై వేలు ఎత్తి చూపరు. ఇతరుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండండి".
-నిత్యామీనన్​, సినీ నటి.


రెడ్​ టాప్​, బ్లూ జీన్స్​ వేసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది నిత్యా మీనన్​. ప్రస్తుతం మిషన్ మంగళ్ ప్రచారంలో బిజీగా గడుపుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇది చదవండి: సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!

Last Updated : Sep 26, 2019, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details