తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీష్మ'కు కొబ్బరికాయ కొట్టిన నితిన్​-రష్మిక - actor nitin

టాలీవుడ్​ హీరో నితిన్​, అందాల భామ రష్మిక కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రం 'భీష్మ'. నేడు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈనెల 20 నుంచి రెగ్యులర్​ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది చిత్ర బృందం.

'భీష్మ'కు కొబ్బరికాయ కొట్టిన నితిన్​-రష్మిక

By

Published : Jun 12, 2019, 1:07 PM IST

విభిన్న కథాంశాలను ఎంచుకునే నితిన్​.. త్వరలో భీష్మగా అలరించనున్నాడు. ఈరోజు సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రష్మిక మందణ్న కథానాయిక. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. నేడు హైదరాబాద్​లో పూజా కార్యక్రమాలు జరుపుకొంది. నితిన్‌తో పాటు రష్మిక మందణ్న, దర్శక, నిర్మాతలు హాజరయ్యారు.

పూజా కార్యకంలో భీష్మ చిత్రబృందం

'భీష్మ' అనే టైటిల్​కు 'సింగిల్ ఫర్ ఎవర్' అనేది ఉపశీర్షిక. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలనుకునే అబ్బాయికి ఓ అమ్మాయి ఎలా జ్ఞానోదయం చేసిందనేదే కథాంశంగా తెలుస్తోంది.

ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నితిన్​ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్​లుక్​ పోస్టర్​కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ABOUT THE AUTHOR

...view details