తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విభిన్న కథతో నితిన్ 'చెక్​'.. మళ్లీ ఆ దర్శకుడితో సత్యదేవ్​ - కంబాలపల్లి కథలు

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. నితిన్​ 'చెక్​' ఫస్ట్ ​గ్లింప్స్​​తో పాటు 'శశి' లిరికల్​ వీడియో, 'గాడ్సే' ఫస్ట్​లుక్​ ఇందులో ఉన్నాయి.

Nithin's Check Movie Glimpise.. Satyadev's new movie Godse
విభిన్న కథాంశంతో 'చెక్​'.. 'బ్లఫ్​మాస్టర్​' దర్శకుడితో సత్యదేవ్​

By

Published : Jan 3, 2021, 1:35 PM IST

  • నితిన్‌ హీరోగా నటిస్తున్న 'చెక్' సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది. ఇందులో ఖైదీలా నితిన్ కనిపించారు. సరికొత్త కథతో దర్శకుడు చంద్రశేఖర్​ యేలేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది.‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లు.
  • ఆది సాయికుమార్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'శశి'. ఇటీవలే టీజర్​ విడుదలై ఆకట్టుకోగా, ఆదివారం(జనవరి 3) తొలి లిరికల్​ గీతాన్ని రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్​ ఆలపించారు. సురభి కథానాయికగా కనిపించనుంది.
  • సత్యదేవ్​ వరుస సినిమాలతో జోరు పెంచేస్తున్నారు. 'తిమ్మరుసు', 'గుర్తుందా శీతాకాలం' చేస్తున్న అతడు.. 'గాడ్సే' చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.​ ఫస్ట్​లుక్​ ఆదివారం విడుదల చేశారు. గతంలో సత్యదేవ్​తో 'బ్లఫ్​మాస్టర్'​ తీసిన గోపీగణేశ్​.. దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
    'గాడ్సే' ఫస్ట్​లుక్​
  • 'కంబాలపల్లి కథలు' సిరీస్​లోని 'మెయిల్​'ను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఆహా ఓటీటీ ఇది స్ట్రీమింగ్ కానుంది.
    'కంబాలపల్లి కథలు' వెబ్​సిరీస్​ మెయిల్​ రిలీజ్​ డేట్

ABOUT THE AUTHOR

...view details