తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్వారంటైన్​లో షాలిని.. డిఫరెంట్​గా బర్త్​డే చేసిన నితిన్ - నితిన్ పవన్​కల్యాణ్

తన భార్య ప్రస్తుతం క్వారంటైన్​లో ఉండటం వల్ల ఆమె పుట్టినరోజు వేడుకల్ని డిఫరెంట్​గా చేశారు హీరో నితిన్. ఆ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

nithin with wife shalini
నితిన్ షాలిని

By

Published : Jan 7, 2022, 11:49 AM IST

"కొవిడ్‌.. మనుషుల మధ్య దూరాన్ని పెంచొచ్చు. కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు పెట్టలేదు" అని కథానాయకుడు నితిన్‌ అంటున్నారు. ఆయన తన సతీమణి షాలిని పుట్టినరోజును విభిన్నంగా జరిపారు. కరోనా కారణంగా షాలిని ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. దీంతో శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా గురువారం అర్ధరాత్రి ఆమెను కిటికీ నుంచి బయటకు చూడమని చెప్పి.. గార్డెన్‌ ఏరియాలో కేక్‌ కట్‌ చేసి నితిన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

నితిన్‌ చూపించిన ప్రేమకు ఫిదా అయిన ఆమె థ్యాంక్యూ అంటూ చిరునవ్వులు చిందించారు. ఈ వీడియోను నితిన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. "హ్యాపీ బర్త్‌డే మై లవ్‌. జీవితంలో మొదటిసారి నువ్వు నెగెటివ్‌ కావాలని కోరుకుంటున్నా" అని రాసుకొచ్చారు. అది చూసిన ఫ్యాన్స్‌.. "హ్యాపీ బర్త్‌డే.. మీరు త్వరగా కోలుకోవాలి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న నితిన్‌-షాలిని.. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జులై 27న వివాహం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details