తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రకుల్ విషయంలో షాకైన హీరో నితిన్ - nithin rakul preet news

పాటలు, గ్లామర్ అంశాలు లేకపోయినప్పటికీ రకుల్ తమ సినిమాలో నటిస్తానని ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని నితిన్ చెప్పారు. వీరిద్దరూ కలిసి నటించిన 'చెక్' ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

nithin shocked on rakul preet singh decision about check movie
రకుల్ విషయంలో షాకైన హీరో నితిన్

By

Published : Feb 20, 2021, 10:55 AM IST

వరుస కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూ దక్షిణాది అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు సంబంధించి ఓ విషయంలో తాను షాకయ్యానని హీరో నితిన్‌ అన్నారు. వీరిద్దరితో పాటు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'చెక్‌'. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకుడు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో నటీనటులు బిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగా నితిన్‌ను దర్శకుడు వెంకీ అట్లూరి సరదాగా కాసేపు ఇంటర్వ్యూ చేశారు. తన కెరీర్‌లోనే 'చెక్‌' ఓ విభిన్న కథా చిత్రమని.. 80 శాతం సినిమా జైలులోనే ఉంటుందని నితిన్‌ తెలిపారు. సినిమాలోని పాత్ర కోసం మానసికంగానూ సిద్ధమయ్యానని.. అందువల్ల ప్రతిరోజూ షూట్‌ అయ్యాక కూడా అదే ఆలోచనలతో, విచారంగా ఉండేవాడని అన్నారు. దాంతో కొన్నిరోజులపాటు తన భార్య షాలిని.. 'ఆయనకు ఏమైంది?ఎందుకు విచారంగా ఉన్నారా?' అనే ఆలోచనల్లో పడిందని ఆయన వివరించారు.

చెక్​ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్​తో నితిన్

'ప్రియా ప్రకాశ్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా. 30 నిమిషాలు మాత్రమే ఆమె స్క్రీన్‌పై కనిపిస్తుంది. రకుల్‌ విషయానికి వస్తే.. తను ఓ కమర్షియల్‌ హీరోయిన్‌. ఇందులో తను లాయర్‌లా కనిపించనుంది. తన క్యారెక్టర్‌ చాలా కొత్తగా, హుందాతనంగా ఉంటుంది. ఒక కమర్షియల్‌ హీరోయిన్‌ అయి ఉండి పాటలు, రొమాన్స్‌ ఉండవని తెలిసి, కథ చెప్పిన వెంటనే చేయడానికి రకుల్‌ అంగీకరించడం తెలిసి షాకయ్యాను' అని నితిన్‌ వివరించారు.

ఇది చదవండి:అమెరికన్ ఖైదీ కథతో నితిన్ 'చెక్' సినిమా!

ABOUT THE AUTHOR

...view details