ప్రస్తుతం 'భీష్మ'లో నటిస్తున్న టాలీవుడ్ హీరో నితిన్ మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అవయవదానం ఆవశ్యకతను తెలిపే కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
నితిన్‌తో కలిసి ప్రియా ప్రకాశ్ ఏ మాయ చేస్తుందో! - ప్రియా ప్రకాశ్ వారియర్
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభమైంది. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు.
ఇద్దరు భామలతో హీరో నితిన్ కొత్త చిత్రం
ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. కన్ను గీటి సంచలనం సృష్టించిన ప్రియా ప్రకాశ్ వారియర్ మరో కథానాయికగా కనిపించనుంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది.
ఇది చదవండి: హీరో నితిన్‌కు తప్పని ట్రాఫిక్ కష్టాలు