హీరో నితిన్, విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కలయికలో ఓ చిత్రం రాబోతుంది. ఈ సినిమా లాంఛనంగా హైదరాబాద్లో ప్రారంభమైంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనుంది. కన్ను గీటి కుర్రకారు హృదయాన్ని దోచిన ప్రియా వారియర్ ఈ సినిమాలో మరో హీరోయిన్.
రకుల్, ప్రియా వారియర్ మధ్యలో నితిన్! - priya
ఇప్పటికే 'భీష్మ' చిత్రంతో బిజీగా ఉన్న నితిన్.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి.
నితిన్
నితిన్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రంగా మిగిలిపోతుందని నిర్మాత వి. ఆనందప్రసాద్ తెలిపారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించనున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ఇందులో రష్మిక మందణ్న హీరోయిన్ నటిస్తోంది.