తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maestro: ఆ పాత్రలో నితిన్ జీవించేశాడు: మేర్లపాక గాంధీ - మూవీ న్యూస్

'మాస్ట్రో' సినిమా విశేషాలు వెల్లడించిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ.. నితిన్​పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఓటీటీలో సెప్టెంబరు 17న రిలీజ్ అవుతోంది.

Nithin maestro movie
నితిన్ 'మాస్ట్రో' సినిమా

By

Published : Sep 14, 2021, 5:31 AM IST

నితిన్ 'మాస్ట్రో'.. సెప్టెంబరు 17న ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పాటలు, ప్రచార చిత్రాలు.. సినిమాపై అప్పుడే అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు మేర్లపాక గాంధీ చిత్రవిశేషాలు చెప్పారు.

నితిన్ మాస్ట్రో మూవీ

'అంధాధున్' సినిమా చూసిన తొలిసారే.. దీనిని తెలుగులో రీమేక్​ చేయాలని అనుకున్నానని గాంధీ అన్నారు. అంధుడి పాత్రలో నితిన్ జీవించేశారని తెలిపారు. టబు పాత్ర కోసం కొంచెం యంగ్​ నటి ఎంచుకోవాలని అనుకున్నానని, అందుకే తమన్నాను తీసుకున్నట్లు పేర్కొన్నారు.

థ్రిల్లర్​ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేశ్ హీరోయిన్​గా నటించింది. తమన్నా ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనుంది. జిషూసేన్ గుప్తా, శ్రీముఖి, మంగ్లీ, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details