యువ హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కనున్న సినిమా 'రంగ్‌దే'. 'గివ్ మీ సమ్ లవ్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా... విజయదశమి రోజున చిత్రీకరణ ప్రారంభించుకుంది.
సినిమా పూజా కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు దిల్‌రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), జెమిని కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. నితిన్, కీర్తిలపై ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ కొట్టాడు. దిల్‌రాజు, చినబాబు కలిసి స్క్రిప్టును వెంకీ అట్లూరికి అందించాడు.
" ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు".
--వెంకీ అట్లూరి, సినీ దర్శకుడు