తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలనాటి 'విజేత'ను గుర్తు చేస్తున్న నేటి 'భీష్మ' - నితిన్​ కొత్త సినిమా

అలనాటి 'విజేత'ను గుర్తు చేస్తున్నాడు నేటి 'భీష్మ'. ఆ విజేత మరెవరో కాదు ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్​ చిరంజీవి. మరి భీష్మ ఎవరంటే యువ హీరో నితిన్. చిరును నితిన్​ గుర్తు చేయడమేంటని అనుకుంటున్నారా?

nithin in megastar costume in bheeshma new poster
అలనాటి 'విజేత'ను గుర్తు చేస్తున్న నేటి 'భీష్మ'

By

Published : Feb 13, 2020, 8:38 PM IST

Updated : Mar 1, 2020, 6:08 AM IST

నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'భీష్మ'. ఇందులోని సింగిల్స్‌ ఆంథమ్‌ వీడియోను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటించే ఓ పోస్టర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. ఆ పోస్టర్​లో బజాజ్‌ చేతక్‌పై స్టైల్‌గా దర్శనమిచ్చాడు నితిన్‌. ప్రస్తుతం ఈ పోస్టర్​లో నితిన్​ ఫోజు వైరల్​ అవుతుంది.

ఈ పోస్టర్​లో కుడివైపు తెల్ల రంగు, ఎడమ వైపు నీలం, ఎరుపు, పచ్చ రంగులు కలిసిన చొక్కాను ధరించి ఉంటాడు నితిన్‌. అయితే అది నాటి తరానికి చెందిన కాస్ట్యూమ్‌ కావడం వల్ల అందరి దృష్టి దానిపై పడింది. 1985లో వచ్చిన 'విజేత' చిత్రంలో మెగాస్టార్​ ధరించిన చొక్కాను తలపిస్తుంది. దీంతో టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతుంది. అప్పుడెప్పుడో చిరు వేసిన చొక్కాను మళ్లీ ఇప్పుడు నితిన్‌ ఎందుకు వేశాడు? ఆ సినిమాలోని ఏదైనా సన్నివేశాన్ని 'భీష్మ'లో నితిన్‌తో చేయిస్తున్నారా? అంటూ సందేహ పడుతున్నారు. దీనికి సమాధానం కావాలంటే ఈనెల 21 వరకు ఆగాల్సిందే.

ఇదీ చదవండి:సాయితేజ్​ నినాదం.. 'సోలో బ్రతుకే సో బెటర్​'

Last Updated : Mar 1, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details