తెలంగాణ

telangana

ETV Bharat / sitara

60 ఏళ్ల ప్రయాణం.. 3 పాత్రలు.. 2 భాగాలు - పవర్​పేట సినిమా

వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు హీరో నితిన్. త్వరలో ఈహీరో నటించిన 'భీష్మ' విడుదల అవుతుండగా.. సెట్స్​పై ముస్తాబవుతోన్న మరో చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ కథానాయకుడు. తన జీవితంలోనే అత్యంత అరుదైన చిత్రమిదని పలు ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని తెలిపాడు.

Nithin declared 'Power Peta' is the most ambitious and challenging film of his career
60 ఏళ్ల ప్రయాణం.. 3 పాత్రలు.. 2 భాగాలు

By

Published : Feb 16, 2020, 7:32 PM IST

Updated : Mar 1, 2020, 1:25 PM IST

అటు సినీ కెరీర్​ పరంగా ఇటు వ్యక్తిగతంగా ఫుల్​ జోష్​లో ఉన్నాడు హీరో నితిన్​. త్వరలోనే ప్రేయసి షాలిని కందుకూరితో పెళ్లి పీటలెక్కనున్నాడు. దాదాపు 8ఏళ్ల వీరి ప్రేమాయణానికి ఏప్రిల్‌లో జరిగే వివాహంతో శుభం కార్డు పడనుంది.

నితిన్‌ సినిమాల విషయానికొస్తే.. 'భీష్మ' చిత్రం విడుదలకు సిద్ధమైంది. వెంకీ అట్లూరితో చేస్తున్న 'రంగ్‌ దే' సెట్స్‌పై ముస్తాబవుతోంది. ఇక ఈ హీరో చేతిలో ఉన్న మరో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి చంద్రశేఖర్‌ యేలేటిది కాగా.. మరో రెండు 'పవర్‌ పేట', 'అంధాధున్‌'. తాజాగా 'పవర్‌ పేట' చిత్ర కథకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు నితిన్‌. ఇది తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన చిత్రమని చెప్పాడు.

"కృష్ణ చైతన్యతో చెయ్యబోయే 'పవర్‌ పేట' చాలా పెద్ద స్పాన్‌ ఉన్న కథ. రెండు భాగాలుగా తీయనున్నాం. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయింది. 1960 నుంచి 2020 వరకు నడిచే కథతో రూపొందనుంది. ఇందులో నేను 18 ఏళ్ల యువకుడిగా.. 40 ఏళ్ల వ్యక్తిగా.. 60ఏళ్ల వృద్ధుడిగా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తా. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న మూడు చిత్రాలు పూర్తయ్యాకే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తా. ఆ తర్వాత మేర్లపాక గాంధీతో 'అంధాధున్‌' రీమేక్‌ చేస్తా."

- నితిన్​, హీరో

60 ఏళ్ల ప్రయాణం.. 3 పాత్రలు.. 2 భాగాలు

నితిన్​ హీరోగా తెరకెక్కిన 'భీష్మ' ఈనెల 21న విడుదల కానుంది. ఇందులో రష్మిక కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్​టైన్స్​మెంట్స్​ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.

ఇదీ చదవండి:గ్యాలరీ: అట్టహాసంగా ఫిల్మ్​ఫేర్​ అవార్డుల వేడుక

Last Updated : Mar 1, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details