తెలుగు సినిమా రంగంలో 'చెక్' మరో మంచి చిత్రంగా నిలుస్తుందని అన్నారు హీరో నితిన్. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్రబృందం సహా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కల్యాణ్ మాలిక్ అద్భుతంగా సంగీతమందించారని ప్రశంసించారు. నితిన్, ప్రియా వారియర్ జంటగా.. రకుల్ ప్రీత్‌సింగ్ న్యాయవాదిగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నితిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉరిశిక్ష పడ్డ ఖైదీ చదరంగం ఆటతో ఎలా బయటపడ్డాననే కథాంశంతో విభిన్న కథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఈ చిత్రంలోని విడుదలైన 'నిన్ను చూడకుండా' లిరికల్ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరిచిపోలేని అనుభూతి
'చెక్' సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు ప్రముఖ సంగీత దర్శకుడు, కీరవాణి సోదరుడు కళ్యాణ్ మాలిక్ తెలిపారు. చంద్రశేఖర్ యేలేటితో అమృతం నుంచి సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆయన చాలా రోజుల తర్వాతా 'చెక్' కోసం మళ్లీ ఇద్దరు కలిసి పనిచేశారు. యేలేటి సినిమాలను తాజ్ మహల్‌తో పోల్చిన ఆయన ఈ సినిమాలో ఒకే ఒక పాట ఉండటం ఎంతో బాధ్యత పెంచిందన్నారు.
చెక్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని వివరించారు. పియానో, గిటార్ లాంటి వాద్య పరికరాలను సరికొత్త రీతిలో వినియోగించి నేపథ్య సంగీతాన్ని అందించినట్లు వెల్లడించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందన్నారు.
ఇదీ చూడండి:'చెక్' లిరికల్ సాంగ్.. '101 జిల్లాల అందగాడు' రిలీజ్ డేట్