ఫ్లాప్‌లు, హిట్లతో సంబంధం లేకుండా పాతిక సినిమాలు చేసిన నితిన్... ఇష్క్, అఆ, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో అభిమానుల్లో తన గ్రాఫ్ పెంచేసుకున్నాడు. అయితే తాజాగా నటించిన శ్రీనివాస కళ్యాణం, చల్ మోహన్ రంగ, లై, కొరియర్ బాయ్ కళ్యాణ్, చిన్నదాన నీకోసం చిత్రాలు అనుకున్నంతగా రాణించలేదు...సరైన హిట్ కోసం జాతీయ అవార్డు పొందిన దర్శకుడితో జతకడుతున్నాడు.
' చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆనంద్ ప్రసాద్ భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌లో మొదలవుతుంది. కీరవాణి సంగీతం అందించనున్నారు. నేను ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను'
-- టాలీవుడ్ హీరో, నితిన్