తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సింగిల్​' ఫరెవర్​ అన్నాడు.. సింపుల్​గా పెళ్లికొడుకయ్యాడు

టాలీవుడ్​ యువ కథానాయకుడు నితిన్​ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన స్నేహితురాలు, ప్రియురాలైన షాలినిని త్వరలో పెళ్లిచేసుకోనున్నాడు. వీరిద్దరి నిశ్చితార్థం శనివారం హైదరాబాద్​లో జరిగింది.

nithin-and-shalini-engagement
'సింగిల్​ ఫర్​ఎవర్​' అని సింపుల్​గా పెళ్లి చేసుకుంటున్నాడు

By

Published : Feb 15, 2020, 3:21 PM IST

Updated : Mar 1, 2020, 10:28 AM IST

టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ పెళ్లికొడుకయ్యాడు. కొంతకాలంగా అతడి ప్రేమాయణంపై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. శనివారం హైదరాబాద్‌లోని త‌న‌ నివాసంలో షాలినితో... ఈ హీరోకు నిశ్చితార్థమైంది. ఈ వేడుక‌కు సన్నిహితులు మాత్రమే హాజ‌రయ్యారు. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వీరిద్దరి పెళ్లి జరగనుందట.

2012లో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందట. రెండేళ్ల క్రితం నుంచి వీరి స్నేహం.. ప్రేమగా మారిందని సమాచారం. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారట. షాలినికి వెరైటీగా ప్ర‌పోజ్ చేయాల‌ని భావించిన నితిన్.. ఒంటికాలిపై నిలబడి ఆమెకి ప్రపోజ్ చేశాడట. నితిన్ చేష్టలు చూసి నవ్వుకున్న షాలిని.. వెంటనే అతడి ప్రేమను ఒప్పుకుందట. నితిన్ సినిమాల‌ను త‌ర‌చూ చూస్తుండే షాలినికి 'లై' సినిమా మాత్రం అర్థం కాలేదట.

ఫిబ్ర‌వ‌రి 21న 'భీష్మ' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు నితిన్​. ఇందులో రష్మికతో ఆడిపాడాడు. త‌ర్వాత 'రంగ్ దే', 'అందుదాన్' తెలుగు రీమేక్​లో నటించనున్నాడు.

ఇదీ చూడండి.. 'భీష్మ' లైఫ్​ స్టోరీ ఇదే: రష్మిక

Last Updated : Mar 1, 2020, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details