టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ మిస్తీ చక్రవర్తి చనిపోయినట్లు పలు మీడియా సంస్థలు తప్పుగా ప్రచురించాయి.
హీరోయిన్ మిస్తీ చనిపోయిందని పొరపాటు! - misthi chakravarti death
తాను మరణించానంటూ వస్తున్న వార్తలపై స్పందించిన హీరోయిన్ మిస్తీ చక్రవర్తి.. బాగానే ఉన్నానని ఇన్స్టాలో పోస్టు పెట్టింది.
మిస్తీ చక్రవర్తి
అయితే, అసలు విషయం ఏంటంటే, ఇటీవలే మూత్రపిండాల వైఫల్యంతో బెంగాలీ నటి మిస్తీ ముఖర్జీ బెంగళూరులో శుక్రవారం కన్నుమూసింది. ఈ క్రమంలోనే ముఖర్జీ స్థానంలో పొరపాటున చక్రవర్తి చిత్రాన్ని తప్పుగా ప్రచురించారు. దీనిపై స్పందించిన ఆమె.. తనకేం కాలేదని, బాగానే ఉన్నానని స్పష్టం చేసింది.