హీరో నితిన్ నటిస్తున్న 'భీష్మ' సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయమై ట్వీట్ చేసిన ఇతడు.. తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. చిత్రీకరణ ముగియడం తనకు చాలా బాధ కలిగించిందని, అదే సమయంలో ఓ మంచి చిత్రంలో నటించినందుకు గర్వంగా అనిపించిందని రాసుకొచ్చాడు. త్వరలో అందరం మళ్లీ కలిసి పనిచేద్దామని అన్నాడు.
నితిన్‌కు ఓ వైపు బాధ.. మరోవైపు ఆనందం - entertainent news
తను నటిస్తున్న 'భీష్మ' షూటింగ్ పూర్తి కావడంపై భావోద్వేగం చెందాడు హీరో నితిన్. ఓ వైపు బాధగా ఉన్న మరోవైపు గర్వంగా ఉందని ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
హీరో నితిన్
ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించింది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందించాడు. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వంశీ నిర్మించారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Last Updated : Feb 28, 2020, 8:46 PM IST