నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'రంగ్ దే' విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల శుక్రవారం(మార్చి 26) థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న చిత్రబృందం.. హైదరాబాద్లో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అనంతరం సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందమంతా సందడి చేస్తూ కనిపించింది.
'రంగ్ దే' మేకింగ్: అను-అర్జున్ అల్లరే అల్లరి! - NITHIIN 'RANG DE' MOVIE
'రంగ్ దే' మేకింగ్ వీడియో అలరిస్తోంది. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. దానిని మీరు చూసేయండి.
'రంగ్ దే' మేకింగ్: అను-అర్జున్ అల్లరే అల్లరి!
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్-అనుగా నితిన్-కీర్తి సురేశ్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.