హీరో నితిన్.. ప్రస్తుతం 'భీష్మ' సినిమాతోపాటు 'రంగ్‌దే' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే ఆ చిత్రం కోసం ఆసక్తికర టైటిల్‌ను ఎంపిక చేసుకున్నారు. 'చదరంగం' అనే పేరు పెట్టనున్నారని సమాచారం. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు.
నితిన్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. ఆసక్తికర టైటిల్ - హీరో నితిన్‌తో ప్రియాప్రకాశ్
టాలీవుడ్ కథానాయకుడు నితిన్ కొత్త సినిమా కోసం 'చదరంగం' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలో షూటింగ్ మొదలుకానుంది.
![నితిన్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. ఆసక్తికర టైటిల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4666484-809-4666484-1570332103525.jpg)
టాలీవుడ్ కథానాయకుడు నితిన్
చంద్రశేఖర్ యేలేటి.. మిస్టరీ, థ్రిల్లర్ జానర్లలో ఎక్కువగా సినిమాలు తీస్తుంటాడు. ఈ చిత్రమూ అలాంటి ఓ భిన్నమైన కథాంశంతోనే రూపొందనుందని సమాచారం. భవ్య ఆనంద్‌ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి: