తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హిందీ రీమేక్​లో నితిన్ నటించడం లేదు! - హీరో నితిన్

'అంధాధున్' తెలుగు రీమేక్​లో నితిన్ నటించడం లేదని సమాచారం. బదులుగా యువ హీరోతో పాటు కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలని సదరు నిర్మాత భావిస్తున్నారట.

ఆ హిందీ రీమేక్​లో నితిన్ నటించడం లేదు!
నితిన్

By

Published : Nov 28, 2019, 10:13 AM IST

బాలీవుడ్​లో చిన్న సినిమాగా వచ్చిన 'అంధాధున్'.. ఎంత పెద్ద హిట్​ అయిందో అందరికీ తెలిసిందే. హీరో ఆయుష్మాన్​కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్​ చేస్తున్నారు.తెలుగు హక్కుల్ని.. ప్రముఖ నిర్మాత సుధాకర్​రెడ్డి సొంతం చేసుకున్నారు. ఇందులో తన కుమారుడు, హీరో నితిన్ నటిస్తాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడీ విషయంలో పలు మార్పులు జరుగుతున్నాయట.

'అంధాధున్' తెలుగు రీమేక్​ కోసం తొలుత హీరో నితిన్, దర్శకుడు సుధీర్ వర్మను తీసుకోవాలని అనుకున్నారట. కానీ నితిన్ నటించేందుకు ఆసక్తి చూపించట్లేదట. అందుకే ఓ యువ హీరోతో పాటు కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలని సదరు నిర్మాత భావిస్తున్నారు. వారు ఒప్పుకున్న వెంటనే షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఇది చదవండి: హీరో నితిన్​కు తప్పని ట్రాఫిక్ కష్టాలు

ABOUT THE AUTHOR

...view details