తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రంగ్​ దే' చిత్రం సంక్రాంతికే.. కానీ! - రంగ్​దే

యంగ్ హీరో నితిన్​, కీర్తి సురేశ్​ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం 'రంగ్​ దే'. లాక్​డౌన్​ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్​ ఈ నెల 23 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Nithiin and Keerthy Suresh's Rang De Movie shoot to resumes From september 23
'రంగ్​ దే' చిత్రం సంక్రాంతికే కానీ..!

By

Published : Sep 18, 2020, 8:07 AM IST

టాలీవుడ్​ యంగ్​ హీరో నితిన్‌, కీర్తి సురేశ్​ జంటగా నటిస్తోన్న చిత్రం 'రంగ్‌ దే'. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల తుది దశ చిత్రీకరణలో ఆగిన ఈ చిత్రం తిరిగి సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఈనెల 23 నుంచి ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో నితిన్‌ - కీర్తితో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతుంది.

'రంగ్​ దే' సినిమా పోస్టర్​

సంక్రాంతికే కానీ..

నితిన్‌ 'రంగ్‌ దే' చిత్రాన్ని సంక్రాంతి లక్ష్యంగానే ముస్తాబు చేస్తున్నట్లు చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. అయితే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా? లేక ఓటీటీ వేదికపైనా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర బృందంతో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఓటీటీ వైపు మొగ్గు చూపినా.. సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details