లేడీ సూపర్‌స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'నిశ్శబ్దం'. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాట ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. 'నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా' అంటూ సాగే ఈ పాటను యవ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. గోపీసుందర్ స్వరాలు సమకూర్చాడు. త్వరలోనే పూర్తి పాట రానుంది.
ఆకట్టుకుంటున్న 'నిన్నే నిన్నే' సాంగ్ ప్రోమో - nishabdham movie latest updates
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'నిశ్శబ్దం'. తాజాగా ఈ సినిమాలోని ఓ పాట ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.
ఆకట్టుకుంటున్న 'నిన్నే నిన్నే' సాంగ్
ఇటీవల సినిమాలోని ఒక్కో క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసి.. మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, మైఖైల్ మ్యాడ్‌సన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ప్రధానాంశంగా వస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 జనవరి 31 ప్రేక్షకుల ముందుకు రానుంది.