తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక భావోద్వేగం - niharika marriage latest news

తన పెళ్లి వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు మెగా డాటర్ నిహారిక. ప్రస్తుతం ఇది వైరల్​ మారి మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

nischay wedding video
చైతూ ప్రేమ సందేశం.. నిహారిక భావోద్వేగం

By

Published : Jan 25, 2021, 11:55 AM IST

ఏ అమ్మాయి జీవితంలోనైనా వివాహమనేది ఓ మధురమైన అనుభూతి. ఎన్నో బంధాలు.. అనుబంధాలు.. భావోద్వేగాలకు వివాహం ఓ వేదికగా మారుతుంది. పుట్టింటి బంధాలకు దూరంగా అత్తవారింటిలోకి అడుగుపెట్టే ప్రతి యువతి పెళ్లి సమయంలో ఉద్వేగానికి లోనవుతుంది. మెగా డాటర్ నిహారిక కూడా తన పెళ్లి అప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ వీడియోను షేర్‌ చేశారు.

పెళ్లి వేడుకలు ప్రారంభించిన నాటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది. 'ప్రియమైన నిహా.. వివాహబంధంతో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని తెలిసింది' అంటూ చైతన్య పంపించిన సందేశం చూసి నిహారిక భావోద్వేగానికి గురయ్యారు.

కల్యాణ తిలకం దిద్దే సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను హత్తుకుని నిహారిక ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా పెళ్లి మండపంలో మెగాబ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సరదాగా మాట్లాడుకోవడం.. వరుణ్‌తేజ్‌, బన్నీ ఆత్మీయ ఆలింగనం.. ఇలా ఎన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పొందుపరిచారు.

చైతన్య - నిహారిక

ABOUT THE AUTHOR

...view details