తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిశ్చయ్ వేడుక.. పెళ్లిలో నిహారిక మురిసిన వేళ - పెళ్లిలో నిహారిక

మెగా డాటర్ నిహారిక పెళ్లి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వివాహ తంతు సందర్భంగా ఆమె ఉల్లాసంగా ఉన్నారు.

nischay wedding video
నిహారిక చైతన్య పెళ్లి

By

Published : Dec 10, 2020, 10:50 AM IST

వేదమంత్రాలు.. పెద్దల ఆశీర్వచనాల నడుమ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి జరిగిన వీరి వివాహానికి ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ హోటల్‌ వేదికైంది. ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు మెగా, అల్లు కుటుంబాలతో పాటు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

నిహారిక - నాగబాబు
జీలకర్ర బెల్లంతో నిహారిక చైతన్య

నిహారిక-చైతన్యల వివాహానికి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పెద్దల సమక్షంలో చైతన్యను మనువాడే వేళ నిహారిక ఉల్లాసంగా ఉన్నారు. కన్యాదానం, జీలకర్ర-బెల్లం, తాళికట్టు శుభవేళ.. ఇలా ప్రతి సందర్భంలోనూ నూతన జంట సంతోషాన్ని చూసి వేదికపై ఉన్నవారు ఆనందించారు. తలంబ్రాల వేడుకలో నిహారిక.. తన భర్త జుట్టును సరిచేస్తూ.. మురిసిపోయారు. అనంతరం మెగా, అల్లు కుటుంబసభ్యులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details