డాక్టర్‌బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్. ఎంతోపేరు తీసుకొచ్చిన ఆ సీరియళ్ల వల్లే తనకు 'అష్టాచమ్మా' సినిమా అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎందుకలా జరిగిందో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పంచుకున్నారు. తన భార్య మంజులతో కలిసి ఈ షోలో సందడి చేశారు.
'ఆ సినిమా ఛాన్స్ అలా చేజారిపోయింది' - నిరుపమ్, మంజుల
ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఈ వారం బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేశారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం నేడు (సోమవారం) రాత్రి ఈటీవీలో ప్రసారం కానుంది.
నిరుపమ్
ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. సీరియల్‌ను సీరియల్‌లా కాకుండా వ్యక్తిగతంగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయని, అలాంటి కొందరు తనకు ఫోన్ చేసి చెప్పుల దండ వేసి సన్మానిస్తామని బెదిరించారని నిరుపమ్ చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలియాలంటే.. మే 17(నేడు) రాత్రి 9.30గ ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమోను చూసి ఆనందించండి.