తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2019, 1:38 PM IST

Updated : Jun 30, 2019, 2:48 PM IST

ETV Bharat / sitara

సందీప్​ను వీడని నీడ.. కారణమేంటి?

సందీప్ కిషన్​ 'నిను వీడని నీడను నేనే' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సందీప్​ను వీడని ఆ నీడ.. కారణమేంటి?

యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. అన్య సింగ్ హీరోయిన్​గా నటించింది. కార్తిక్ రాజు దర్శకత్వం వహించాడు. ట్రైలర్​ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం.

'400 సంవత్సరాలకు పూర్వం గ్రీస్‌లోని ఓ గ్రామంలో ఓ బాలుడికి అద్దంలో ఓ పెద్దాయన రూపం కనిపిస్తుండేది. భయపడి ఆ పిల్లాడిని చంపేశారు ఆ గ్రామ ప్రజలు. ఎక్కడో చదివిన ఈ విషయాన్ని ఇప్పుడు నేరుగా చూస్తున్నా’ అని ఓ చర్చి ఫాదర్‌ చెబుతున్న డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు వీఐ ఆనంద్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించాడు. తమన్ సంగీతమందించాడు. హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్​కు గాయాలు

Last Updated : Jun 30, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details