తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముగ్గురిని ఒప్పించిన సందీప్​ కిషన్​ - disco raja

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. అన్యా సింగ్​ కథానాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సందీప్​ కోసం... కెమెరా ముందుకొచ్చిన దర్శకులు

By

Published : Jun 19, 2019, 9:51 PM IST

చిత్రబృందానికి నాయకత్వం వహిస్తూ బిజీగా ఉండే దర్శకులను నటించేలా చేశాడు సందీప్​ కిషన్​. అన్యా సింగ్ జోడీగా అతడు నటించిన చిత్రం 'నిను వీడని నీడను నేను'. ఇందులో ఇద్దరు యువ దర్శకులు, ఓ హీరోయిన్​ అతిథి పాత్రల్లో కనిపించారు. కార్తీక్​ రాజు తెరకెక్కించిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆనంద్, కార్తీక్, మాళవిక నాయర్

ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో నటించారు దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'టైగర్' చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' చిత్రానికి ఇతడే దర్శకుడు. సందీప్ కిషన్ నటించిన ఓ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకుడుగా వ్యవహరించాడు. ఆ సినిమా తెలుగులో 'డి 16' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. హీరోయిన్​ మాళవిక విజేత, టాక్సీవాలా చిత్రాల్లో నటించింది. ఈ ముగ్గురూ సందీప్ కిషన్ అడగ్గానే అతిథి పాత్రల్లో నటించారు.

ఇటీవల విడుదలైన 'నిను వీడని నీడను నేనే' టైటిల్ సాంగ్‌ ‘ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో 'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి ...' అనే పాటను హీరో సిద్ధార్థ్ పాడాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ బాణీలు సమకూర్చారు. పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details