'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు కొందరు హీరోయిన్లు. ఓ వైపు యాక్టింగ్‌లోనే రాణిస్తూనే మరో వైపు వ్యాపారాల్లో(Actresses in business) హిట్లు కొడుతున్నారు. ఆ హీరోయిన్లు ఎవరు? వాళ్లు చేసే వ్యాపారాలేంటో(Actresses in business) ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్లలు దాటిన ప్రియాంక
బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది ప్రియాంక చోప్రా. అలాగే వ్యాపారంలోనూ(Actresses in business) ఒక్క రంగానికే పరిమితం కాలేదు. 'పర్పుల్ పెబెల్ పిక్చర్స్' పేరుతో ఆమెకో సొంత నిర్మాణ సంస్థ ఉంది. 'అనోమలీ' పేరుతో కేశసౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ నడిపిస్తోంది. కుర్ర జంటల్ని ఆకట్టుకోవడంలో ముందున్న 'బంబుల్' అనే డేటింగ్ యాప్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. ఇంతేకాదండోయ్.. 'సోనా' బ్రాండ్‌తో ఆకాశహర్మ్యాల నగరం న్యూయార్క్‌లో రెస్టారంట్లనే నడిపిస్తోంది.
సౌందర్యానికే కత్రినా ఓటు
షేర్‌మార్కెట్‌లో కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా 'నైకా' గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లిస్టింగ్ రోజే ఈ ఆన్‌లైన్ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ బంపర్ లాభాలు రాబట్టింది. ఇందులో మన కత్రినాకైఫ్‌కి చెప్పుకోదగ్గ వాటా ఉందండోయ్! వాటాలు కాకుండా కేవలం లిస్టింగ్ రోజున కత్రినా రూ.22 కోట్ల లాభాలు మూటకట్టుకుందట. ఇదేకాదు.. 'కే బ్యూటీ కాస్మొటిక్స్' కంపెనీలోనూ క్యాట్ వ్యాపార భాగస్వామి.
అందరికన్నా ముందున్న దీపిక
కెరీర్ జోరు మీదున్నప్పుడే వ్యాపారంలోకి అడుగుపెట్టిన అమ్మడు దీపికా పదుకొణె. 'కేఏ ఎంటర్‌ప్రైజెస్' పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి తొమ్మిదేళ్ల కిందటే ఓ వ్యాపార సంస్థ ప్రారంభించింది. 'ఎపిగామియా' అనే ఎఫ్‌ఎంసీజీ సంస్థ, 'ఫ్రంట్ రో' అనే ఎడ్యు స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది. 'బ్లూ స్మార్ట్' అనే ఎలక్ట్రిక్ టాక్సీ స్టార్టప్‌లోనూ వాటాలున్నాయి. బెల్లాట్రిక్స్ అనే ఏరోస్పేస్ టెక్నాలజీ కంపెనీలోనూ అడుగుపెట్టిందని టాక్. 'కేఏ ప్రొడక్షన్స్' నిర్మాణ సంస్థ తనదే.
ఎదురులేని అనుష్క
నటనలోనే కాదు.. సినిమా నిర్మాణంలో దూసుకెళ్తున్న నటి అనుష్కశర్మ. ఇరవై ఏడు ఏళ్లకే 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' ప్రొడక్షన్ హౌజ్‌కి యజమానురాలైంది తను. 'ఎన్‌హెచ్ 10' కమర్షియల్ హిట్ అందుకుంది. 'నుష్' పేరుతో ఆన్‌లైన్ ఫ్యాషన్ బ్రాండ్ నిర్వహిస్తోంది. భర్త, క్రికెటర్ విరాట్ జిమ్ స్టూడియోల్లోనూ తన 'షేర్' ఉండనే ఉంది.
అలియా వైవిధ్యంగా..