టాలీవుడ్ యువ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. టీఎన్ సంతోష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా విషయంపై స్పందించాడు నిఖిల్.
గతేడాది రిలీజ్ అవ్వాల్సిన ‘అర్జున్ సురవరం’ సెప్టెంబర్‌కు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 'అర్జున్ సురవరం' రిలీజ్ గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.. 'సాహో' తర్వాతే విడుదల ఉంటుందని స్పష్టం చేశాడు.