టాలీవుడ్ యువ హీరో నిఖిల్, పల్లవిల వివాహం గురించి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ ప్రేమజంట ఏప్రిల్ 16న పెళ్లి పీటలెక్కాల్సింది కానీ కరోనా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అంతా సవ్యంగా ఉంటే మే 14న చేసేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు నిశ్చయించారు. కానీ ఆ తర్వాత లాక్‌డౌన్ పొడిగింపుతో మరోసారి వాయిదా వేద్దామనుకున్నారు.
రేపే నిఖిల్-పల్లవిల వివాహం! - నిఖిల్ పల్లవి పెళ్లి తేదీ ఫిక్స్
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ పెళ్లి రేపు (మే 14న) జరగనుందని తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మంది అతిథులతో హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరగబోతుందట.
నిఖిల్
లాక్‌డౌన్ మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటం వల్ల అనుకున్న ముహూర్తానికే చేసే ఆలోచనలో ఉన్నారట. గురువారం (మే 14) రోజే నిఖిల్ వివాహం జరిగే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మంది అతిథులతో హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరగబోతుందని తెలుస్తోంది.