తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అర్జున్​ సురవరం'గా 'ముద్ర' - natti kumar

విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న ముద్ర సినిమా టైటిల్​ను ఎట్టకేలకు మార్చింది చిత్రబృందం. అర్జున్​ సురవరంగా యువ కథానాయకుడు నిఖిల్​ మార్చి 29న థియేటర్లలో సందడి చేయనున్నారు.

అర్జున్​గా నిఖిల్

By

Published : Feb 5, 2019, 2:25 AM IST

Updated : Feb 5, 2019, 9:28 AM IST

యువ కథానాయకుడు నిఖిల్​ నటించిన తాజా చిత్రం ముద్ర టైటిల్​పై గతకొంత కాలంగా నడుస్తున్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. తాజాగా 'అర్జున్​ సురవరం' పేరుతో సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈరోజు నిఖిల్​ టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు. సంతోష్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయిక. నిఖిల్​ పరిశోధనాత్మక పాత్రికేయుడి పాత్రలో నటిస్తున్నారు. మార్చి 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Last Updated : Feb 5, 2019, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details