కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే విషయంలో గాంధీ వైద్యులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని టాలీవుడ్ హీరో నిఖిల్ అన్నాడు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న వారిని అతడు అభినందించాడు. వైరస్ తరిమికొట్టే పోరాటంలో డాక్టర్లు చేస్తున్న సేవలను కొనియాడాడు. గాంధీ ఆస్పత్రిలోని వైద్యులను కలిసి రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. వైద్యులకు శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేశాడు.
వైద్యుల కృషిని గుర్తించాలన్న హీరో నిఖిల్ - hero nikhil news
కరోనా నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్న వైద్యులను కొనియాడాడు టాలీవుడ్ యువకథానాయకుడు హీరో నిఖిల్. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని వైద్యులను కలిసి అభినందించాడు. వారికి కావాల్సిన శానిటైజర్స్, మాస్క్‌లను అందించాడు.

వైద్యుల కృషిని గుర్తించాలన్న హీరో నిఖిల్
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన హీరో నిఖిల్
ఈ మహమ్మారిని అరికట్టేందుకు డాక్టర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని హీరో నిఖిల్ అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలు చేపట్టి లాక్ డౌన్ నిర్వహించడం వల్ల వైరస్ వ్యాప్తిని కొంతమేర అరికట్టవచ్చని వెల్లడించాడు. గాంధీ సూపరిండెంట్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. తమకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. వైద్యుల విషయంలో భారతదేశం మొత్తం తమకు అండగా ఉందని కరోనా వైరస్ నివారణకు తగిన చర్యలు చేపడుతున్నట్లు అతడు తెలిపాడు.
ఇదీ చూడండి.. కరోనాపై పోరుకు అక్షయ్ రూ.25 కోట్ల విరాళం