యువ కథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో2014లో రూపొందిన 'కార్తికేయ' చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్గా 'కార్తికేయ - 2' రూపొందనుందన్న వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది ఖరారైంది.
'కార్తికేయ'కు సీక్వెల్ వచ్చేస్తోంది.. - nikhil
నిఖిల్, స్వాతి జంటగా 2014లో వచ్చిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్ రాబోతోంది. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ - 2 ' పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు (జూన్ 1) సందర్భంగా అధికారికంగా వెల్లడించారు.
'కార్తికేయ - 2' చిత్ర నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.
ఇవీ చూడండి.. 'ఆకారం తూనీగ.. ముట్టుకుంటే కందిరీగ'