'హ్యాపీడేస్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'స్వామిరారా' చిత్రం అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత చేసిన చిత్రాలతో వరుస హిట్లు అందుకుని దూసుకెళ్తున్నాడు. తాజాగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన నిఖిల్.. ఓ గమ్మత్తైన విషయాన్ని పంచుకున్నాడు. కెరీర్ మొదట్లో తాను రవితేజ మేనరిజమ్ కనపడేలా నటించడానికి ప్రయత్నించేవాడినని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత నటనలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉండాలని గుర్తించి ఎవరిని అనుకరించకుండా నటించడం మొదలుపెట్టానని చెప్పాడు.
నిఖిల్ ఎక్కువగా ఫాలో అయ్యే స్టార్స్ ఎవరంటే? - alito saradaga hero nikhil
'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హాజరయ్యాడు. కెరీర్ ప్రారంభంలో నటనలో తాను రవితేజ, పవన్ కల్యాణ్‌ను అనుకరించేవాడినని తెలిపాడు. కానీ అది సరికాదని గుర్తించి ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నట్లు వెల్లడించాడు.
"నాకు పవన్ కల్యాణ్, రవితేజ అంటే చాలా ఇష్టం. వాళ్లు యూత్ ఐకాన్. తెలియకుండానే నాపై వాళ్ల ప్రభావం ఉండేది. దాదాపు 'స్వామిరారా' సినిమా ముందు వరకు నటనలో నేను పవన్, రవితేజను అనుకరించేవాడిని. నా నటన నుంచి వాళ్లను తీసేయడానికి చాలా సమయం పట్టింది. వాళ్లలా కాకుండా పాత్రకు తగ్గట్లుగా నటించడం నేర్చుకున్నా. నిజానికి కెరీర్ ప్రారంభంలో నా దగ్గరకొచ్చే దర్శకులంతా నా కోసం వచ్చేవారు కాదు. రవితేజలా నేను నటిస్తాను కాబట్టి, ఆయన కాల్షీట్లు దొరకనివాళ్లు, కథ రిజెక్ట్ చేస్తే.. అచ్చం ఆయనలాగే నేను నటించాలంటూ అడుగుతూ నా దగ్గరికి వచ్చేవారు" అని నిఖిల్ చెప్పాడు.
ఇదీ చూడండి నటి కంగనా రనౌత్‌పై మరో కేసు