"రీతూని పెళ్లి చేసుకుంటా.. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. రేపు నాకు పుట్టబోయే పాప పేరు ఎప్పుడో నిర్ణయించేసుకున్నా" అంటూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర అభిమానులతో పంచుకున్నాడు యువ హీరో నిఖిల్. తెలుగు చిత్రసీమలో వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ... సినీప్రియుల మదిలో చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడీ హీరో. తాజాగా మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు నిఖిల్. ఈ సందర్భంగా ఆమె అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆసక్తికర జవాబులిచ్చాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
లావణ్యతో డేట్‌కు వెళ్తా...!
"హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ.. ఈ ముగ్గురిలో ఎవరిని చంపుతారు, ఎవరితో డేట్‌కు వెళ్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు" అని నిఖిల్‌ను అడగ్గా.. హెబ్బాను చంపాలనుందని చెప్పాడు నిఖిల్. "సెట్స్‌లో హెబ్బా కొన్నిసార్లు తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో నాకర్థం కాదు కానీ, తెగ విసిగిస్తుంది (నవ్వుతూ). అందుకే తనని పక్కా చంపేస్తా. నిజం చెప్పాలంటే తనొక అద్భుతమైన నటి. ఇక లావణ్యతో మాత్రం డేట్‌కు వెళ్లాలనుంది. తను సెట్స్‌లోకి అడుగుపెట్టిందంటే చాలు.. ఒక్కసారిగా అందరి చూపులు ఆమె వైపే వెళ్తాయి. ఇంత అందంగా ఉందేంటిరా బాబు అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం రీతూ వర్మనే ఎంపిక చేసుకుంటా. తనెంతో చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఆమెతో సెట్స్‌లో చాలా సౌకర్యంగా అనిపిస్తుంటుంది" అని చెప్పాడు.
డాక్టర్‌తో ప్రేమలో ఉన్నా..