మెగా డాటర్ నిహారిక వివాహం గురించి టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఇటీవలే ఈ కొణిదెల వారసురాలు పెళ్లి పీటలెక్కనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ తనయుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనుంది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
కాబోయే భర్త బర్త్‌డేకు నిహారిక స్పెషల్ విషెస్ - niharika fiance latest news
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న కొణిదెల వారసురాలు నిహారిక. తాజాగా తన కాబోయే భర్త చైతన్య పుట్టిన రోజుకు స్పెషల్ విషెస్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
నిహారిక
తాజాగా తన కాబోయే భర్త పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ.. నిహారిక స్పెషల్ విషెస్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్‌డే లవ్' అని రాసుకొచ్చింది. "ఒక చిరునవ్వు గది మొత్తాన్ని వెలుగులతో నింపుతుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలిగేలా కౌగిలించుకుంటుంది. నువ్వు నా సంతోషపు చిరునామా చై. ప్రతి విషయంలో నువ్వు ఉత్తమమైన వ్యక్తివి." అని నిహారిక పేర్కొంది.
Last Updated : Jul 26, 2020, 5:05 PM IST