తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దక్షిణ భారతదేశంలో తొలి వెబ్​సిరీస్​ మాదే: నిహారిక - NIHARIKA LATEST NEWS

హైదరాబాద్​లో 'యూట్యూబ్ తెలుగు డే' కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక.. వెబ్​ సిరీస్​ల గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది. ప్రస్తుత సమాజంలో వాటికి పెరుగుతున్న ఆదరణ గురించి వివరించింది.

హీరోయిన్ నిహారిక

By

Published : Nov 14, 2019, 4:35 PM IST

నిహారిక... 'ముద్దపప్పు ఆవకాయ' వెబ్​సిరీస్​తో నటి, నిర్మాతగా తన ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్​గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే హైదరాబాద్​లోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 'యూట్యూబ్ తెలుగు డే'లో పాల్గొంది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కొణిదెల నిహారిక

"ఓ నటిగా, నిర్మాతగా, రచయితగా నాకు ఈ వేదికపైనే గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ మన సొంత నిర్ణయాలతో మనకు నచ్చినట్లు నటించొచ్చు, కథలు తయారు చేసుకోవచ్చు. ఇందులోనే సంతృప్తి ఉంది. ఆదరణ ఎక్కువే. కాలానికి అనుగుణంగా జనం మారిపోతున్నారు. సినిమాను థియేటర్లకు వెళ్లి చూసే వాళ్లు తక్కువై.. స్మార్ట్​ ఫోన్లు, ఓటీటీ(నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్) వేదికల్లో సినిమా చూద్దామనుకునేవారు ఎక్కువవుతున్నారు. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కొన్ని రోజుల వరకు లఘచిత్రాల సందడి సాగింది. ఇప్పుడంతా వెబ్​సిరీస్​లదే హవా. ఇందుకోసమే 'ముద్దపప్పు ఆవకాయ' అనే మొదటి వెబ్​సిరీస్​ మొదలుపెట్టాం. దక్షిణ భారతదేశంలో తొలి వెబ్​సిరీస్​ మాదే. దేశంలోనే వంద ఎపిసోడ్​లు పూర్తి చేసుకున్న తొలి వెబ్​సిరీస్​ ఇదే. దానికి విపరీతమైన క్రేజ్​ వచ్చింది. అందుకే ఇప్పుడు 'మ్యాడ్​ హౌస్​' పేరుతో మరో వెబ్​సిరీస్​ చేస్తున్నాం" -నిహారిక, నిర్మాత, రచయిత, హీరోయిన్

ఇటీవలే 'సైరా నరసింహారెడ్డి'లో నటించింది నిహారిక. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో హీరోయిన్​గా చేస్తున్నట్లు చెప్పింది.

మ్యాడ్​హౌస్ వెబ్​సిరీస్​ పోస్టర్

ఇది చదవండి: 'మ్యాడ్​ హౌజ్'​ పేరుతో మెగా హీరోయిన్ వెబ్​సిరీస్​

ABOUT THE AUTHOR

...view details