మెగా వారసురాలు నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. శనివారం స్వగృహంలో ఈ శుభకార్యాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో అలంకరించారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిహారిక చిలకపచ్చ రంగు పట్టు చీరలో కళకళలాడారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్ తేజ్ దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటున్నారట.
పెళ్లి కూతురుగా నిహారిక.. ఫొటోలు వైరల్ - పెళ్లి కూతురుగా నిహారిక.. ఫొటోలు వైరల్
మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో పెళ్లి నేపథ్యంలో నిహారికను పెళ్లి కూతురు చేశారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.
పెళ్లి కూతురుగా నిహారిక.. ఫొటోలు వైరల్
గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను నిహారిక మనువాడబోతోంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి తంతు జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్ శుభకార్యానికి వేదిక కాబోతోంది.