మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గురించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు, సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవలే ఇందుకు సంబంధించి నిహారిక చిన్న క్లూ ఇవ్వడం సహా.. కాబోయే వ్యక్తితో దిగిన ఓ ఫొటోను ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం కనపడకుండా అటువైపు తిప్పి ఉండటం వల్ల ఎవరై ఉంటారా? అని మెగా అభిమానులంతా నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో మరో పోస్ట్ పెట్టిన నిహారిక అతనెవరో రివీల్ చేసింది.
అబ్బాయి ఎవరంటే..