మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యపై న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను చైతన్య కొంతకాలం క్రితం అద్దెకు తీసుకున్నారు. అయితే అపార్టుమెంట్‌లో ఆఫీస్ పెట్టటానికి వీల్లేదని అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చైతన్య, అపార్టుమెంట్ వాసుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఆఫీస్‌లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తమ అపార్ట్‌మెంట్‌లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు.