కరోనా కాటుకు అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా కుదేలైపోయింది. చిత్రీకరణలు నిలిచిపోవడం వల్ల సినీ తారలంతా ఇంటి పట్టునే కాలం గడుపుతున్నారు. అనుకోకుండా దొరికిన ఈ విరామ సమయాన్ని కొందరు తమ అభిరుచులకు తగ్గట్లు గడుపుతుంటే.. మరికొందరు కొత్త కళలు, సరికొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోనే నేనూ ఉన్నానంటోంది ఇస్మార్ట్ సుందరి నిధి అగర్వాల్.
బుద్ధిగా ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకుంటున్న నిధి - నిధి అగర్వాల్ తాజా వార్తలు
లాక్‌డౌన్ సమయంలో తమకు నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు సినీతారలు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఎంచక్కా ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులు నేర్చుకుంటోంది. దానికి సంబంధించిన ఓ ఫొటోను నెట్టింట అభిమానులతో పంచుకుంది.
![బుద్ధిగా ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకుంటున్న నిధి నిధి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6877883-thumbnail-3x2-nid.jpg)
ఈ లాక్‌డౌన్ కాలంలో ఎంచక్కా పెన్ను, పుస్తకం ముందేసుకుని ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులు నేర్చుకుంటోందట. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇందులో నిధి రెండు జడలు వేసుకున్న చిన్న పిల్లలా క్యూట్‌గా కనిపించింది. "నేను చక్కగా బుద్ధిమంతురాలిలా ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకుంటున్నా. ఇందులో కనిపిస్తున్న ఈ కేశాలంకరణని చిన్నప్పుడు నేనెంతో ఇష్టపడేదాన్ని. దీన్ని ఇప్పుడు నేను మళ్లీ ప్రయత్నించాలి అనుకుంటున్నా. మీరేమంటారు?" అంటూ ఆ ఫొటోలకు ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది నిధి.