తన అందంతో పాటు నటనతోనూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది నిధి అగర్వాల్. తెలుగులో ఇస్మార్ట్ శంకర్‌తో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు తరచూ ఫొటోషూట్స్‌తో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటుందీ భామ. అయితే తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ ఫొటోకు సంబంధించి కొంచెం ఘాటుగా స్పందించింది. అలాంటి ఫొటోలు షేర్ చేయడం తప్పని మండిపడింది.
నెటిజన్లకు నిధి అగర్వాల్ సీరియస్ వార్నింగ్ - నెటిజన్లకు నిధి అగర్వాల్ వార్నింగ్
నటి నిధి అగర్వాల్ నెటిజన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 'అలాంటి ఫొటోలు షేర్ చేయకండి' అంటూ మండిపడింది.
నిధి అగర్వాల్
"నాకు సంబంధించిన ఈ ఫొటో అవసరం లేకపోయినా ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉంటింది. వాస్తవానికి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి ఫొటోలు ఎవరి దృష్టికైనా వస్తే వాటిని షేర్ చేయకండి. అది అనవసరం. వాటిని చీప్ పనులు అంటారు," అంటూ సీరియస్‌గా చెప్పేసింది నిధి.
నిధి ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. అలాగే యువ నటుడు అశోక్ గల్లా హీరో చిత్రంలోనూ ఆడిపాడనుంది.