యువ కథానాయిక నిధి అగర్వాల్ పుట్టినరోజు నేడు(ఆగస్టు 17). ఈ సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం ఆమె పాత్ర 'పంచమి' లుక్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
'హరిహర వీరమల్లు' అప్డేట్.. 'పంచమి'గా నిధి అగర్వాల్ - నిధి అగర్వాల్ బర్త్‌డే
మంగళవారం(ఆగస్టు 17) హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది 'హరిహర వీరమల్లు' చిత్రబృందం. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నిధి అగర్వాల్
17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 50శాతం పూర్తయిందని సమాచారం. ఆ మధ్య బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ నేతృత్యంలో పవన్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: మారుతున్న టాలీవుడ్ 'యాక్షన్' పంథా!